Home Loan Interest – హౌస్ లోన్ వడ్డీ తిరిగి పొందడం ఎలా ?
Home Loan Interest లేదా హౌస్ లోన్ / హోమ్ లోన్ కి కట్టిన వడ్డీని తిరిగి పొందడం ఎలా ?? ఇది చాలా మందికి తెలియని విషయం , సాధారణం గా ఇంటి కి తీసుకొన్న ఋణం కి వడ్డీ తో సహా చెల్లించడం మనకు తెలిసిన విషయం కానీ మనం కట్టిన వడ్డి తాలూకు డబ్బు ని అదే మొత్తం లో ఎలా తిరిగి పొందవచ్చు అన్నది మాత్రం చాలా తక్కువ మందికి తెలిసిన విషయం . ఈ రోజు హోమ్ లోన్ లేదా హౌస్ లోన కి కట్టిన వడ్డీ ని మనం పెట్టుకొన్న హోమ్ లోన్ అయిపోయాక ఎలా పొందవచ్చు అనే విషయం వివరం గా తెలుసుకొందాం
వివరాల్లోకి వెళ్తే సతీష్ అనే వ్యక్తి తన యింటి నిర్మాణం కోసం 24 లక్షలు HDFC బ్యాంకు నుండి ఋణం గా హౌస్ లోన్ పొందాడు . సదరు బ్యాంకు ఇందు నిమిత్తం అతనికి 6. 80 % వడ్డీ నిర్ణయించింది దీనికి గాను సతీష్ 20 సంవత్సరాలు కాలం పెట్టుకొన్నాడు . అతని నెల వారి ఈ .యం .ఐ 16150 గా ఉంది . అంటే 16150 * 12 నెలలు = 1,93,800 గా ఉంది . కాబట్టి తాను నిర్ణయించుకొన్న 20 సంవత్సరాలకు 20*193800=38,76,000 అవుతుంది . దీని అర్ధం సతీష్ ఇంటి అవసర నిమిత్తం SBI బ్యాంకు దగ్గర 24 లక్షలు లోన్ ని 20 సంవత్సరాలకు పొందితే చివరకి ఆటను కట్టవలసినది 38 లక్షల 76 వేల రూపాయలు అనగా తాను తీసుకొన్న 24 లక్షలకి 14 లక్షల 76 వేల వడ్డీ గా చెల్లిస్తున్నాడు . తన హౌస్ లోన్ పూర్తి అయ్యే సమయానికి తాను తీసుకొన్న దాని కన్నా ఒక అంచనా ప్రకారం 15 లక్షలు దాకా కట్టాల్సి వస్తుంది . ఇదే సమయం లో Home Loan Interest రేటు భవిషత్ లో మారిపోతే ఇంకా ఎక్కువ వడ్డీ కట్టాల్సి రావచ్చు .
ఇది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా భారం గా మారచ్చు . మిగతా వాటిలో లాగ వడ్డీ మాఫీ అనేది హౌస్ లోన్ లో ఉండదు కాబట్టి కచ్చితం గా కట్టి తీరాల్సిందే . మనం కట్టాల్సిన వడ్డీ ఇంట మొత్తం అని ఒక లెక్క తెలిస్తే చాలా అసహనం కి గురి అవుతాము . దీనిని అధిగమించడానికి నిపుణులు మరొక చక్కని మార్గం కనిపెట్టారు . ఆ మార్గం ని మనం ఉపయోగించుకోగలిగితే ఇంటి ఋణం కి కట్టిన వడ్డీ ని 90% దాక లోన్ పూర్తి అయ్యే రోజు కి మనం పొందవచ్చు . దీనికోసం మనం చెయ్యవలసినది అల్లా లోన్ లో 0.01% ని SIP లో ఇన్వెస్ట్ చెయ్యాలి అది ఏ విధం గా అనేది కింద ఇవ్వబడింది .
సతీష్ తీసుకొన్న ఇంటి ఋణం 20 లక్షలు అనుకొంటే 0. 01 % అనగా నెలకి 2000 రూపాయలు వడ్డీ గా కట్టాము అనుకోని SIP లో ఇన్వెస్ట్ చేయాలి. అనగా 12 నెలలు * 2000 రూపాయలు = 24000 రూపాయలు ఒక సంవత్సరానికి అదనం గా ఖర్చు అవుతుంది . ఇలా 24,000 రూపాయలని ప్రతి నెలా క్రమం గా sip లో ఇన్వెస్ట్ చెయ్యాలి . ఇదే విధం గా హౌస్ లోన్ అయిపొయ్యేదాకా ప్రతి నెల 2000 రూపాయలు సిప్ లో పెడుతూ వెళ్ళాలి . ఇలా చేస్తే 20 సంవత్సరాలకి గాను 20 * 24000 = 4,80,000 అనగా 4 లక్షల 80 వేళా రూపాయలు మనం చెల్లిస్తాం 20 సంవత్సరాల కాలానికి , 15% రిటర్న్ వేసుకొన్న 20 సంవత్సరాల సమయానికి గాను తక్కువ లో తక్కువ గా 21 లక్షలు వరకు మనకు రితుర్న్ వస్తుంది . ఇలా లెక్క కడితే , హౌస్ లోన్ కి మనం కట్టిన 14,76,000 వడ్డీ ని ఒక క్రమ పద్ధతి లో ఇన్వెస్ట్ చెయ్యడం ద్వారా సులభం గా పొందవచ్చు .
సతీష్ తీసుకొన్న హౌ స్ లోన్ = 24,00,000
20 ఇయర్స్ కి కట్టిన మొత్తం ( ఇంటి లోన్ 24 + వడ్డీ 14. 76 ) = 38. 76 లక్షలు
20 సంవత్సరాలు హౌస్ లోన్ కోసం కట్టిన వడ్డీ ( ఇంటి కోసం తీసుకొన్న డబ్బు – 20 సంవత్సరాలకు కట్టిన మొత్తం ) = 14,76,000
SIP లో నెలకి 2000 కట్టడం ద్వారా 20 yr కి అయినా మొత్తం (20000 * 24000 )= 4,80,000
SIP లో దాచిన సొమ్ము కి 15% వడ్డీ వచ్చినా 20 Yr కి పొందే మొత్తం = 19,00,000
SIP లో పెట్టిన మన సొమ్ము కాక మనకే అదనం గా వచ్చినది = 4 లక్షలు దాకా
ఇలా చూసుకొంటే మనం కట్టిన 4. 80 లక్షలు మనకి ఉంది , అలాగే మనం కోల్పోయిన 14,76,000 వడ్డీ ని sip లో ఇన్వెస్ట్ చెయ్యడం ద్వారా మనం కట్టిన వడ్డీ ని సులభం గా మనం తిరిగి పొందవచ్చు . ఇదే హౌస్ లోన్ ఇంటరెస్ట్ ని తిరిగి మనం పొందే సులభమైన మార్గం . నెలకు 2000 మనది కాదు అని సిస్టమాటిక్ గా పొదుపు చెయ్యగలిగితే మనం కట్టిన వడ్డీ ని సులభం గా అనాయాసం గా తిరిగి ఇంకొక మార్గం ఓ పొందవచ్చు
View Comments (0)