Business Ideas In Telugu | Business Ideas With Low Budget

Business Ideas In Telugu | Business Ideas With Low Budget | Business Ideas For Men Women Housewives :

Business Ideas In Telugu రోజుకి 2 లేదా 3 గంటలు కస్టపడి నెలకు 20000 నుండి 50000 దాకా సంపాదించాలి అనేది బహుశా ఈ రోజుల్లో అందరి కల , నిజానికి ఇది నా కల కుడా .. గతం లో కస్టపడి సంపాదిస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి కానీ నేడు సమాజం లో బోలెడన్ని అవకాశాలు ఉన్నాయ్ . ఆ అవకాశాలు వినియోగించుకొని ఆకాశమే హద్దు గా దూసుకుపోతున్నారు నేటి తరం యువత . ప్రస్తుతం ఉన్న గజి బిజీ పనులలో తీరిక లేని వేగవంతమయిన జీవితాలలో ఎవరికి నిముషం తీరిక లేదు ప్రతీ క్షణం ఎలా వాడుకోవాలని తపన కోరిక తప్ప … ఇదే అవకాశం  గా బోలెడన్ని బిజినెస్ లు వెలిశాయి . ఆలా వెలిసిన వాటిలో మనం చేయ గలిగినవి మనకు ఉపయోగ పాడేవి కొన్ని తెలియ చేసాను ఇవి మీకు సహకరించ గలవు అని భావిస్తున్నాను . మరి కొన్ని కొత్త తెలుగు లో బిజినెస్ ఐడియాస్ తో త్వరలో మీ ముందుకు వస్తాను
1.హోటల్ / టిఫిన్ సెంటర్ / ఫుడ్ ట్రక్ బిజినెస్
ఉదాహరణకి నేను ఆఫీస్ కి 9 గంటలకే వెళ్లాలంటే టిఫిన్ చేసుకొనే సమయం ఉండదు కాబట్టి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్ మీద నేను ఆధార పడాలి . మధ్యాహ్నం భోజనం కోసం ఒక మెస్ మీదనో లేక ఒక బడ్జెట్ హోటల్ మీదనో ఆధార పడాలి . మిడిల్ క్లాస్ జీవితాలలో ఇలాంటివి సర్వ సాధారణం కాబట్టి ఫాస్ట్ ఫాడ్ సెంటర్ లేదా ఫుడ్ ట్రక్ బిజినెస్ కి అవకాశం ఎక్కువ గా ఉంటుంది  . ఒక బిజినెస్ ఏరియా లేదా బాగా స్కూల్ లు కాలాగే లు లేదా గవర్నమెంట్ ఆఫీస్ లు , ప్రయివేటు ఫ్యాక్టరీలు ఉండే ప్రదేశాలు అవీ కుదరక పొతే గవర్నమెంట్ లేదా ప్రయివేటు హాస్పిటల్ ఉండే ఏరియా లేదా MRO ఆఫీస్ , కోర్ట్ లు మరియు  జన సమూహాలు ఎక్కువ గా ఉండే ఏరియా ని చూసుకొని ఒక చిన్న ఫుడ్ ట్రక్ లేదా హోటల్ లేదా టిఫిన్ సెంటర్ పెట్టుకోవచ్చు
ఫుడ్ ట్రక్ కొంచం ఎక్కువ పెట్టుబడి అవుతుంది కానీ ఒక చైనా షాప్ రెంట్ కి తీసుకొని పెట్టుకోడం ద్వారా మొదట కొద్దీ మొత్తం తో బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి ఫ్యూచర్ లో బిజినెస్ ఎక్సపండ్ చేసుకొనే వెసులు బాటు ఉంది , దీనికి గాను ఒక 50000 నుండి 100000 దాకా పడుతుంది . రోజుకి 2000 నుండి 5000 దాక బిజినెస్ జరుగుతుంది . ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ . పూరి , పుల్కా , చపాతీ  కి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఆదాయం చాల ఎక్కువ ఉంటుంది , ఇడ్లి ,బోండా  , దోస కి ప్రతి 100 రూపాయల  పెట్టుబడి కి గాను 150 నుండి 250 రూపాయలు దాకా రావచ్చు . మొదట గా ఒక వర్కర్ ని పెట్టుకొని మిగతా అంటా మనమే చూసుకొని  నెమ్మదిగా బిజినెస్ పెరిగే కొద్దీ ఇంకో వర్కర్ లేదా ఇద్దరు వర్కర్ ని పెట్టుకొని సజావుగా ఈ వ్యాపారం సాగించవచ్చు
2.టీ స్టాల్ లేదా కేఫ్ :
టీ లేదా కాఫి భలే మంచి గిరాకే ఉన్న బిజినెస్ . ఈ రోజుల్లో టీ లేదా కాఫి తాగని వారు లేరు . ఈ టీ లేదా కాఫి బిజినెస్ కి కాస్త ఆరోగ్య చిట్కా లు కలిపితే ఖచ్చితమ్ గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది .  ఇందులో ఎలాంటి సందేహం లేదు . నేడు యువత నుండి పండు ముసలి దాకా పని ఒత్తిడి తో అలసట తో ఒక కాఫీ లేదా టీ ద్వారా కొంచం ఒత్తిడి ని తగ్గించుకోవాలని చూడడం సర్వ సాధారణం . కాబట్టి ఈ టీ లేదా కాఫి షాప్ కి మంచి గిరాకే ఉంది . టిఫిన్ లేదా ఫుడ్ ట్రక్ బిజినెస్ లాగా ఇది కూడా మంచి జన సమూహం ఉండే సెంటర్ లలో కనుక పెట్టుకొంటే లక్షలు ల లో ఆదాయం పొందవచ్చు . దీని పెట్టుబడి చాల అంటే చాల తక్కువ 1 లక్ష రూపాయల తో ఈ బిజినెస్ ని స్టార్ట్ చెయ్యవచ్చు . రోజు కి 3000 నుండి 5000 దాక ఆదాయం ఉంటుంది . ఖర్చులు 1000 తీసివేసినా  2000 నుండి 4000 దాక ఆదాయం వస్తుంది . ఈ బిజినెస్ కి తోడుగా సిగిరెట్ లు , సమోసా లు , మొలకెత్తిన విత్తనాలు , కేక్ లు , బిస్కెట్ లు , గ్రీన్ టీ , అల్లం టీ , శొంఠి కాఫీ  , హనీ టీ  ని కూడా  షాప్ లో అందుబాటు లోకి తీసుకు వస్తే  ఆదాయం మరింత పెరిగి  మీరు నమ్మలేనంత ఆదాయం  మీ ఖజానా లో చేరుతుంది .

3. పుల్కా బండి ( Business Ideas In Telugu Pulka Bandi ):

పుల్కా అనేది ఆయిల్ లేకుండా ఉండే ఒక ఆరోగ్యమైన ఫుడ్ ఐటమ్ . షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరు చపాతీ లేదా పుల్కా తినమని డాక్టర్ లు సలహా ఇస్తారు . కాబట్టి ఈ బిజినెస్ కి తిరుగు లేని ఆదాయం కచ్చితం గ వస్తుంది . నేటి తరం లో చాల మంది ఆరోగ్యం కోసం పుల్కా లాంటి లైట్ ఫుడ్ ని ఇష్టపడుతున్నారు కానీ పుల్కా లోకి కాస్త  రుచికరమైన కూర ఉంటె తప్పకుండా ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది . నాకు తెల్సిన 3 చోట్ల ఈ బిజినెస్ పెట్టి రోజుకి 5000 నుండి 10000 సంపాదించే రాజస్థాన్ వాళ్ళని మా ఏరియా లో లోకల్ గా వాళ్ళని చూసి స్టార్ట్ చేసిన సక్సెస్ అయినా వాళ్ళని నేను అడిగి తెలుసుకొన్న తర్వాతనే ఈ విషయం ఇక్కడ చెప్తున్నాను. ఈ పుల్కా షాప్ లేదా బండి చాల తక్కువ ఇన్వెస్ట్మెంట్ కానీ రిటర్న్ లో చాలా డబ్బులు వస్తాయని వాళ్ళు చెప్పారు . చెప్పడమే కాదు నేనే పక్కన ఉంది గమనించి తెలుసుకున్నాను . దీనికి కావలసిన పదార్థాలు కేవలం 3  1. గోధుమ పిండి 2.నూనె 3.గ్యాస్ లేదా పొయ్యి
D -mart  లో ఒక కేజీ గోధుమ లేదా ఆటా పిండి 23 నుండి 25 కి వస్తుంది . లేదా ఆశీర్వాద్  లాంటి బ్రాండెడ్ ఐటెం ఐతే 45 నుండి 50 లోపు లభిస్తుంది . మనం వాడే ఐటెం ని బట్టి లాభం లో తేడా ఉంటుంది . 25 రూపాయలు కాగ్ కి వాడితే లాభం 150 నుండి 200 శాతం ఉంటుంది అదే బ్రాండెడ్ ఆటా వాడితే 80 నుని 150 శాతం ఆదాయం తీసుకోవచ్చు . ఇక నూనె విషయం కి  వస్తే ఇది కూడా అంటే పామాయిల్ లోకల్ లో 60 నుండి 80 లోపు లీటర్ వస్తుంది అదే సన్ ఫ్లవర్  లేదా గ్రౌండ్ నెట్ ఆయిల్ వాడితే ఖర్చు పెరుగుతుంది .  1 కిలో గోధుమ పిండితో 30 నుండి 50 దాక చపాతీలు లేదా పుల్కాలు చెయ్యవచ్చు . ఒక చపాతీ  10 రూపాయలు  వేసుకున్నా 400 నుండి 500 ఆదాయం ఉంది . పుల్కా కి ఆయిల్ అసలు అవసరం లేదు కాబట్టి ఆయిల్ ఖర్చు మిగులుతుంది ,
ఇక కర్రీ విషయానికి వస్తే మనమే తయారు చేసుకోవచ్చు లేదా బయట కర్రీ పాయింట్ వాళ్లతో హోల్ సేల్ రేటుకి మాట్లాడుకొని మనమే 2 లేదా 3 ఐటమ్స్ పెట్టి రన్ చేయవచ్చు . కర్రీ 1 కేజీ  100 నుండి 150 దాక హోల్ సేల్ కర్రీ పాయింట్ లో  దొరుకుతుంది . ఇదే మనం సొంతం గ చేసుకొంటే ఎక్కువ మొత్తం చేసేకొద్ది ఖర్చు తగ్గుతుంది 2 లేదా  3 కేజీ లోపల అయితే మనకు గిట్టుబాట కాదు .ఓ చపాతీ బయట రేటు 15 రూపాయలు  ఒక పుల్కా బయట రేటు 1 కి 10 రూపాయలు .
మనం చాపాటి 10 రూపాయలు  , పుల్కా సైజు తగ్గించి 10 కి రెండు గా ఇస్తే మొదట బిజినెస్ బాగా సాగుతుంది ,, బిజినెస్ బాగా పెరిగాక నెమ్మదిగా రేటు పెంచు కొంటె ఆదాయం ఒక్కసారి మీరే నమ్మలేనివిధం గా ఉటుంది , .
ఓన్లీ దోస బండి :
దోస అనేది ఇష్టపడని వారు ఉండరు . అందులో టౌన్  ఏరియా లో దోసలకి భలే గిరాకే ఉంది . ఎక్కువ కారం దోస మరియు నెయ్యి  కారం దోస కి అయితే విపరీతం గా డిమాండ్ ఉంది . ఈ డిమాండ్ ని మనం ఉపయోగించుకోగలిగితే మంచి ఆదాయం మన సొంతం . నిజానికి కేవలం దోస బండి లేదా దోస ట్రక్ పెట్టడం వాళ్ళ సక్సెస్ అవగలమా అని చాలా మంది సందేహం కానీ నన్ను నమ్మండి ఈ బిజినెస్ మీకు కాసుల వర్షం కురిపిస్తుంది . అయితే ఇక్కడ మనం కొన్ని మెళుకువలు పాటిస్తే మాత్రమే మనం ఈ బిజినెస్ లో రాణించగలము లేదా బొక్క బోళ్ల పడటం కచ్చితం . అవి ఏంటి  అంటే
1.  దోసలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలిసేలా మెనూ ఏర్పాటు చెయ్యాలి
2. మొదట రేటు సాధారణ ప్రజలకి అందుబాటు లో ఉండేలా ఏర్పాటు చెయ్యాలి
3. ఈ బిజినెస్ లో మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగే రిచ్ క్లాస్ వాళ్ళు కూడా కార్ లు  ఆపి మరీ తిని వెళ్తారు కాబట్టి  వచ్చే వాళ్ళ వాహనాలు ఆగేడు రోడ్ విశాలం గా ఉండే ప్రదేశం లో  పెట్టాలి
4. ఒక వేళ పార్కింగ్ ఉంటె ఇంకా మంచింది
5. మొదట క్వాలిటీ విషయం లో శుద్ధం  గా ఉండే విషయం లో రుచి విషయం లో రాజీ పడవద్దు
6. వెజ్ దోస లేదా నాన్  వెజ్ అనేది ముందే ఒకటి డిసైడ్ అవ్వండి . వెజ్ ఐతే మసాలా  దోస , కారం దోస  , నెయ్యి కారం , నూనె కారం , పప్పుల పొడి దోస , కరేపాకు పొడి దోస , గోధుమ పిండి దోస ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మెనులో ఉండేలా ప్లాన్ చెయ్యండి . గోధుమ పిండి దోస చాల సులభం అంటే కాకా ఆదాయం ఎక్కువ .
7. నాన్  వెజ్ ఐతే  మీ మెనూ లో చికెన్ దోస , ఇంకేమైనా మీకు  తెల్సిన ణొన్ వెజ్ ఐటమ్స్  ఆడ్ చెయ్యండి
ఇలా పైన చెప్పిన విషయాలు పాటిస్తూ  , ముందు మీ ప్రత్యేకత మీ అర్ లో వాళ్ళకి తెలిసేలా చెయ్యగలిగితే నెమ్మదిగా మీ బిజినెస్ ఎంత సక్సెస్ అవుతుందో మేరే  చూస్తారు . ఒకానొక సమయం లో మీ బండి కోసం 20 నుండి 30 మంది వేచి ఉండే రోజు అతి దగ్గరలో ఉంటుంది . మీకు తెలుసూ తెలియదూ నెల్లూరు కారం దోస ఇప్పటికే ఫేమస్ ఎలా ఉందో తెలుసుకొంటే మీరు షాక్ అవకా మానరు . నెల్లూరు లో నెయ్యి కారం దోస కోసం కనిస్సం 10 నుండి 30 మంది దాకా  లైన్ లో వేచి ఉండి  తిని  వెళ్తారు అంటే అర్ధం చేసుకోండి . 30  సంవత్సరాలు అయినా నెల్లూరు కారం దోస అంగడి రేంజ్ ఇక ఎలా సాగుతుంది అని .
Tags :
Business Ideas In Telugu,
Business ideas With Low Budget ,
Business ideas for men,
business ideas,
business ideas for women,
business ideas for housewives
Recent Posts