ఆధార్ స్టేటస్ చెక్ – ఆధార్ కార్డు స్టేటస్ ( UIDAI Aadhar Status – Aadhar Card Status Online ) :
మీ ఆధార్ కార్డు అప్రూవ్ అయ్యిందా లేదా తెలుసుకోవడం ఎలాగా అని వెతుకుతున్నారా ఐతే ఈ పోస్ట్ మీ కోసమే . మీరు ఆధార్ కార్డు రిజిస్టర్ చేసుకొని ఆధార్ కార్డు స్టేటస్ కోసం వేచి ఉన్నట్టు అయితే ఇప్పుడే మీరు మీ ఆధార్ కార్డు స్టేటస్ చెక్ చెయ్యడం ఎలాగో తెలుసుకోండి . మొదటగా మీ ఆధార్ స్టేటస్ చెక్ చెయ్యడానికి 16 అంకెల ఎన్రోల్మెంట్ నెంబర్ కచ్చితం గ ఉండాలి . ఈ 16 అంకెల ఎన్రోల్ మెంట్ నెంబర్ ని మీకు ఆధార్ నమోదు సమయం లో ఇచ్చిన స్లిప్ ఫై భాగం లో చూడవచ్చు .
ఇదివరకే మనం ఆధార్ స్టేటస్ ని యూ.ఐ. డి. ఏ. ఐ ( Aadhar Status By UIDAI STATUS ) ఆన్లైన్ వెబ్సైటు ద్వారా ఎలా చెక్ చెయ్యాలో తెలుసుకున్నాము ఒక వేళా మీరు ఆ పోస్ట్ మిస్ ఐతే ఎలా తెలుసుకోవాలి ఇక్కడే కొద్దీ పాటి వివరణ ద్వారా తెలుసుకోండి . మొదటగా uidai .gov.in వెబ్సైటు ని ఓపెన్ చెయ్యాలి . మెనూ సెలక్షన్ లో మై ఆధార్ ( MY AADHAR ) అనే ఆప్షన్ మీద కర్సర్ ఉంచినట్లు ఐతే మీకు డౌన్ మెనూ లో చెక్ ఆధార్ స్టేటస్ అని ఓపిక ఆప్షన్ కనపడుతుంది దాన్ని సెలెక్ట్ చెయ్యడం ద్వారా మీకు ఆధార్ కార్డు స్టేటస్ చెక్ చేసే ఆన్లైన్ పేజీ ఓపెన్ అవుతుంది . ఉదాహరణ కోసం మీకు ఆ పేజీ URL ని ఇక్కడ ఇస్తున్నాము ( https://resident.uidai.gov.in/check-aadhaar ) .
ఆధార్ కార్డు స్టేటస్ తెలుసుకోడం ఎలా ?
- వెబ్సైటు ఓపెన్ చేసిన తరువాత మొదటి బాక్స్ లో మీ ఎన్రోల్మెంట్ నెంబర్ ని ఎంటర్ చెయ్యాలి
- ఆ తరువాత బాక్స్ లో మీ ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ అయిన డేట్ అండ్ టైం ని ఎంటర్ చెయ్యాలి . ఇది కూడా మీ ఆధార్ కార్డు ఎన్రోల్ మెంట్ స్లిప్ ఫై భాగం లో ఉంటుంది
- 3 వ బాక్స్ లో అక్కడ ఉన్న అక్షరాలు ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చెయ్యాలి
- కింద చూపించిన ఇమేజ్ లో మీరు ఎలా ఉంటుంది అనే విషయం గమనించవచ్చు
చాలా మంది చదువుకొన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా తమ ఆధార్ స్టేటస్ ని సింపుల్ గా తెలుసుకోగలరు , ఇంకొంతమంది ఆధార్ కార్డు హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ కి కాల్ చెయ్యడం ద్వారా తెలుసుకోగలరు వీటి కన్నా సులభమైన మార్గం ఇప్పుడు మనం తెలుసుకొందాం . మనం మొబైల్ నెంబర్ నుండి sms పంపడం ద్వారా కూడా ఆధార్ కార్డు స్టేటస్ ని తెలుసుకో వచ్చు . కొత్తగా ఆధార్ పోర్టల్ ఈ sms సర్వీస్ ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది . ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ నుండి sms పంపడం ద్వారా ఎలా ఆధార్ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చో చూద్దాం . మొదటగా మీ మొబైల్ నెంబర్ నుండి UID ( స్పేస్ ) STATUS అని క్యాపిటల్ లెటర్ లలో రాయిస్ మీ ఎన్రోల్మెంట్ నెంబర్ ని < enrollment Number > ఇలా క్లోజ్ బ్రాకెట్ లో ఉంచి 51969 నెంబర్ కి ఒక మెసేజ్ పంపాలి . ఇలా పంపడం ద్వారా 5 నుండి 10 నిముషాల్లో మీకు మీ ఆధార్ కార్డు స్టేటస్ పంపబడుతుంది . ఒక వేళా మీ ఎన్రోల్మెంట్ నెంబర్ మీకు తేలిక పొతే మీ ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ సమయం లో మీకు ఇచ్చిన పేపర్ లో మీ 16 అంకెల ఎన్రోల్ మెంట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ డేట్ మరియు టైం తో సహా ఉంటుంది . దాన్ని పంపడం ద్వారా మీకు ఆధార్ స్టేటస్ చూసి పూర్తి వివరాలు అందించబడుతాయి .
- Take your mobile
- Type UID STATUS < Enrolment Number >
- Send It To 51969
- For Ex : UID STATUS <12345678912345> like this and send it to 51969
View Comments (0)